2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.40,337 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఇప్పటివరకు రూ.20,650 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.