జోధ్‌పూర్‌లో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. గ్యాస్ సమస్యను ఏడు రోజుల్లో పరిష్కరించామని, ప్రజలు ఇబ్బందులు పడకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరియా బ్యాగ్ ధర రూ.3వేలకు పెరిగినా, దేశంలో రైతుల కోసం రూ.300కే అందిస్తున్నామని, దేశంలో యూరియా ఉత్పత్తిని పెంచామని ప్రధాని మోడీ తెలిపారు.