హైదరాబాద్ పాతబస్తీ మూసీ పరివాహక ప్రాంతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఖరీదైన ఇళ్లు వదిలేసి వెళ్లమంటే ఎలా వెళ్తారు? ఇష్టంగా కట్టుకున్న ఖరీదైన ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామంటే ఎలా కుదురుతుంది. ఎక్కడికో వెళ్లి వ్యాపారాలు ఎలా చేసుకుంటారు. మేము ఎప్పుడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదు. అన్ని పార్టీలు మూసీపై రాజకీయాలు చేస్తున్నాయి' అని మండిపడ్డారు.