AP: పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. పహల్‌గామ్ ఉగ్రదాడిలో తమ ప్రమేయం లేదని, అన్యాయంగా తమపై భారత్ నిందిస్తోందని పాకిస్థాన్ పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండానే తమ దేశంపై దాడి చేసిందని, అమాయక పాక్ ప్రజలను ఉగ్రవాదులుగా చిత్రీకరించిందని వెల్లడించింది. తమ దేశ మిలిటరీ బేస్‌లపై భారత్ దాడి చేసిందని తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న మత ఘర్షణల నుంచి పక్కదారి పట్టించడానికే భారత్ ఇలా చేస్తుందని ఆరోపించింది.