పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న తీర్పును తాము స్వాగతిస్తున్నట్లు BJP MP రఘునందన్ రావు చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల వ్యవధి లోపల స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నామని తెలిపారు. ఒకేవేళ స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే ఏం అవుతుందో సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. నిర్ణయం తీసుకోకపోతే ఏంటి ? అనే ప్రశ్నకు మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు.