పార్టీ మారితే పాంచ్ న్యాయ్ కింద ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని చెప్పిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాహుల్ చెప్పే మాటలకి, నీతులను కట్టుబడి ఉండాలన్నారు. 'దమ్ముంటే, నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో పాంచ్ న్యాయ్ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలి. స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని రాహుల్, కాంగ్రెస్ మరింత కాలం అవహేళన చేయబోరని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.