ఇంతటి దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

TG: జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురిలో మృతదేహాన్ని కుక్క తినడం తీవ్రంగా కలిసి వేసిందని రాష్ట్ర మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇన్చార్జిగా ఉన్న జిల్లాలోనే ఇంతటి దారుణ ఘటన జరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో మృతదేహన్ని భద్రత పరచలేని దుస్థితి నెలకొందని, ఈ ఘటన ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని లక్ష్మారెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్