ఇండీ కూటమి ర్యాలీకి మద్దతిస్తున్నాం: దీప్కే

ప్రతిపక్ష ఇండీ కూటమి నవంబర్ 1వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో చేపట్టనున్న ర్యాలీకి CJP సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రకటించారు. శనివారం TMC అధినేత్రి మమతా బెనర్జీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 'CJP పూర్తిగా స్వతంత్రమైనది, న్యూట్రల్ ప్లాట్‌ఫామ్. అలాగే ఉండాలి అనుకుంటున్నాం. అయితే ఓట్ల తొలగింపు అంశం చాలా పెద్దది. ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. అందుకే ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడే అందరికీ మద్దతు ఇస్తున్నాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕