చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో కీర్తి సురేశ్ 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే తన పెళ్లి ఇంత వైభవంగా జరుగుతుందని ఊహించలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 15 ఏళ్ల ప్రేమ తాళి కట్టే క్షణంలో కళ్లముందు మెదిలిందని, భావోద్వేగానికి లోనయ్యామని తెలిపారు. ఇంట్లో అంగీకరించకపోతే మేం కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుందామనే అనుకున్నాం అని చెప్పుకొచ్చారు.