తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. మూడు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించినందుకు ప్రధాన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై ఆటోమేటిక్ అనర్హతలు రావాలని వాదించిన రాహుల్ గాంధీ ఇప్పుడు అదే నిబంధనకు కట్టుబడి ఉండాలని సూచించారు.