ఎమ్మెల్యేల అనర్హత అంశంలో స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఉపఎన్నికల గురించి నిర్ణయించేది కేటీఆర్ కాదని.. ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్‌కు లేదని.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాలరాసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీలు, ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారని పేర్కొన్నారు.