AP: 624 మంది నిర్వాసితులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బుధవారం నిర్వహించిన ఏపీ అసెంబ్లీలో మంత్రి సత్యప్రసాద్ మాట్లాడారు. 20 మంది రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని అన్నారు. 7,897 మందికి త్వరలోనే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు భూసేకరణపై R&R ప్యాకేజీలో మిగతా వారికి త్వరలోనే న్యాయం చేస్తామని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.