ఏపీ వాటర్ గ్రిడ్‌ను అడ్డుకుంటాం: ఉత్తమ్

TG: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వద్ద తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. సాగర్ సాగునీటి కేటాయింపుల విషయంలో ఏపీ ప్రభుత్వంతో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే, సాగునీటి విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕