థాయ్‌లాండ్‌లో మోసపోయిన యువకులను తీసుకొస్తాం: లోకేశ్‌

AP: థాయ్‌లాండ్‌లో ఏపీకి చెందిన కొంతమంది యువకులు మోసపోయినట్లు సమాచారం అందిందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఐటీ, డిజిటల్‌ ఉద్యోగాల పేరుతో వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సహాయానికి +91-863-2340678/ వాట్సప్‌ నంబర్‌ 85000 27678ను సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్