చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

TG: ధాన్యం కొనుగోళ్ల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మద్దతు ధర కోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేశాం. చివరి గింజ వరకూ మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. యాసంగిలో 75 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అంచనా. కేంద్రం 52 లక్షల మెట్రిక్‌ టన్నులే కొంటామంది. మేం మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికి 60 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకు కొంటున్నాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్