ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా మరోసారి హెచ్చరికలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇరానియన్ ఎయిర్‌లైన్స్‌ను మూసివేస్తామని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తెలిపారు. విదేశీ సంస్థలు ఇరాన్‌కు సేవలు కొనసాగిస్తే సెకండరీ శాంక్షన్స్ విధిస్తామని హెచ్చరించారు. ఆ విమానాలకు విదేశాల్లో ల్యాండింగ్, ఫ్యూయల్ సదుపాయం ఇవ్వకూడదని, ఎవరైనా ఉల్లంఘిస్తే డాలర్ సిస్టమ్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం ఇరాన్ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.