హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'మూసీ దండి మార్చ్' పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ నది బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేవలం రెండేళ్లు ఓపిక పడితే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తిరిగి అధికారంలోకి వచ్చాక ఎవరి ఇల్లు ముట్టుకోకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.