ఏడాదిలోనే ఇందిరమ్మ టవర్లు పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగిస్తాం: మంత్రి పొంగులేటి

TG: ప్రైమ్ ఏరియాలో అద్భుతమైన టవర్లు నిర్మించి పేదలకు ఇస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి అన్నారు. నాంపల్లిలో ఇందిరమ్మ టవర్‌కు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎకరం అమ్మితే వందల కోట్లు వస్తాయని ఈ ప్రజాప్రభుత్వం అనుకోవట్లేదని ఆయన స్పష్టం చేశారు. ఏడాదిలోనే ఇందిరమ్మ టవర్లు పూర్తి చేసి ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పారు. ఆయా ఫ్లాట్‌పై లోన్లు తీసుకునే సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు. లక్షల రూపాయల విలువైన ఫ్లాట్లను పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕