TG: నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంతో SLBC, డిండి, నక్కల గండి ప్రాజెక్టులను పక్కనబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బడ్జెట్ అయినా కేటాయించి ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో రూ. 13 వేల కోట్లతో రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు.