ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత (VIDEO)

TG: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ డ్రామా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతా లోపాయికారీ ఒప్పందాలేనని, ఫామ్‌హౌస్‌లపై చర్యలు ఉండవని ఆమె వ్యాఖ్యానించారు. ఇది కేవలం మాటల ప్రభుత్వమేనని, చేతలు శూన్యమని కవిత విమర్శించారు.

సంబంధిత పోస్ట్

✕
✕