డిసెంబర్ 3న హుస్నాబాద్‌లో జరిగే బహిరంగ సభా మంత స్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా, ఉత్తర తెలంగాణ కోనసీమగా తీర్చిదిద్దుతామని తెలిపారు. సీఎం పర్యటనలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు బస్సులు, విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు, హైదరాబాద్ నుంచి హుస్నాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సులు ప్రారంభిస్తామని వెల్లడించారు.