ఇండియన్ ఓషన్ దాకా యుద్ధాన్ని విస్తరిస్తాం: ఇరాన్

అమెరికా తమపై మరోసారి దాడి చేస్తే యుద్ధాన్ని విస్తరిస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఖమేనీ అడ్వైజర్ యహ్యా రహీమ్ సఫావి మాట్లాడుతూ.. 'ఈ ఘర్షణలు పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ నుంచి ఎర్ర సముద్రం వరకు విస్తరించాయి. మరిన్ని దాడులు జరిగితే అది హిందూ మహాసముద్రం, అంతకు మించి వెళ్లే ప్రమాదం ఉంది' అని తెలిపారు. ఈ యుద్ధం విస్తరిస్తే ఇండియన్ ఓషన్ పరిధిలోని భారత్‌పైనా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕