ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి పొన్నం

TG: టీజీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీలో 1,500 కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు పెద్దపీట వేసిందని ఆ దిశగా రవాణా సంస్థలో మరిన్ని మార్పులు తెస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నమని తెలిపారు. నిత్యం 65 లక్షల మందికిపైగా ఆర్టీసీ సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్