ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: డిప్యూటీ సీఎం

TG: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం గోదావరిఖనిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, తదితరులు ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం స్కాములు, దోపిడీలు తప్ప పేదలకు ఏమీ చేయలేదని, కేసీఆర్ తన ఇంట్లో న్యాయం చేయనోడు ప్రజలకు ఏం చేస్తాడని విమర్శించారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ నిరంతరం అభివృద్ధి కోసమే తపిస్తున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్