స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: కేటీఆర్

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగానికే గొడ్డలిపెట్టు అని, ఈ విషయంలో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌ అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌ డిస్మిస్‌ చేయడంపై స్పందించారు. 'ముఖ్యమంత్రే స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కి కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫొటోలు, వీడియోలు కళ్లముందు కనిపిస్తున్నా.. ఆధారాలు లేవని అనర్హత పిటిషన్‌ను తిరస్కరించడం అర్థరహితం' అన్నారు.

సంబంధిత పోస్ట్