ఇందిరమ్మ ఇళ్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేస్తాం: పొంగులేటి

TG: ఇందిరమ్మ ఇళ్లు కోసం అర్హులైన నిరుపేదలు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అధికారుల సమీక్షలో మాట్లాడుతూ.. ఈ స్కీమ్ నిరంతర ప్రక్రియ అన్నారు. ఇళ్లు మంజూరై వివిధ కారణాలతో నిర్మాణానికి సిద్ధం కాని వారు, ఇళ్లు అవసరం లేదని చెప్పిన వారి స్థానంలో ఇతర అర్హులకు మంజూరు చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో బిల్లులు రాని వారికి వెంటనే చెల్లించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్