TG: ఆనాడు చెప్పి మరీ గత పాలకుల గడీలను బద్దలుగొట్టామని సీఎం రేవంత్ అన్నారు. ఈసారి సిరిసిల్ల గడీలను నేలమట్టం చేస్తామని సవాల్ చేశారు. బుధవారం సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు వచ్చాయని, తెలంగాణ కోసం కొట్లాడినవారికి తాము ప్రాధాన్యం ఇచ్చామన్నారు.