ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తాం: కవిత

ప్రతిపక్షాలను తిట్టడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారని BRS ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.  ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టిస్తామని ప్రకటించారు. ప్రజల కోసం కాకుండా కొందరి కోసం ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పేదల కోసం కాదు.. పెద్దల కోసం నడుస్తోందని విమర్శించారు. 'చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్