ఏపీని ప్రపంచ స్థాయి క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి దుర్గేష్

ఏపీని ప్రపంచ స్థాయి పర్యాటక, సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడంలో కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముంబయిలో నిర్వహించిన 21వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియా (HICSA) వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి క్రియేటివ్ ఎకానమీ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న వ్యూహాత్మక ప్రణాళికలను ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్