TG: దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం టీ-హబ్‌లో ‘హోమా సీఎంఈ-2026’ పేరిట నిర్వహించిన జాతీయ సదస్సును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, స్టార్టప్ రంగాలను హెల్త్ కేర్‌తో అనుసంధానం చేసి సమగ్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు.