హైదరాబాద్‌ను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతాం: భట్టి

TG: హైదరాబాద్‌లో రూ.52 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫేజ్-2లో రూ.38 వేల కోట్లతో మెట్రో పనులు చేస్తామన్నారు. 366 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, HYDలో 21 రేడియల్ రోడ్ల నిర్మాణం, మూసీ పునర్‌ నిర్మాణ పనులు చేపడుతున్నామని చెప్పారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్‌ను మోస్ట్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని, ఆటోలకు రెట్రోఫిట్‌మెంట్‌ తీసుకొచ్చామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕