వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి. వైద్యం అందక ఆగిపోతున్న పేదవాడి గుండెకు ఊపిరి పోసేలా ఆరోగ్యశ్రీ. రైతు రుణమాఫీ.. ఉచిత కరెంట్. పేదవాడికి బుక్కెడు బువ్వ కరువై ఆకలి బాధతో పస్తులు ఉండకూడదనే ఆలోచనతో రూ.2కే కిలో బియ్యం. అన్నదాతల కష్టాలను తీర్చేందుకు పొలాలకు సాగునీటిని అందించాలనే సంకల్పంతో జలయజ్ఞం ఏర్పాటు. ఒక్కటేమిటీ.. ఇప్పటికే పేదప్రజలు నిన్ను మరువలేదు పెద్దాయన!