రైతుల హక్కులకు భంగం వాటిల్లితే సహించబోం: మంద కృష్ణ మాదిగ

TG: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో వివాదాస్పద భూముల్లో రైతులను హైడ్రా ఇబ్బంది పెడుతోందని, రాష్ట్ర ప్రభుత్వం రైతులను భయబ్రాంతులకు గురిచేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన హైకోర్టు అడ్వకేట్ ముఖీంతో కలిసి రైతులకు మద్దతు తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న కేసుల్లో తీర్పు వచ్చేవరకు హైడ్రా అధికారులు సంయమనం పాటించాలని, లేనిపక్షంలో సహించబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని, హైడ్రా తన పరిధిలోనే పనిచేస్తుందో లేదో పరిశీలించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్