TG: కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీ అధికార కూటమి నేతలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు- సాధన' రౌండ్ టీబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. "నేను మొండిదాన్ని. మీరు అనుకున్నంత మంచిదాన్ని కాదు. మేము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్రా నాయకుల విగ్రహాలు పగలకొట్టి, ఆంధ్రాకు పార్సల్ పంపిస్తాం. మా అస్తిత్వంపై దాడి చేస్తూ, మీ సంస్కృతిని మాపై రుద్దుతామంటే చూస్తూ ఊరుకోం" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.