సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తే, సినిమా కార్మికులకు ఆరోగ్య బీమా, వారి పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి, ఆర్టీసీకి రూ.6 వేల కోట్లు చెల్లించామని, మహిళా సంఘాలకు రూ.1000 కోట్ల భూమి ఇచ్చి వారి ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం కల్పించామని ఆయన గుర్తుచేశారు. అలాగే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్