తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల పోరాట ఫలితంగా ఏర్పడిందని, అయితే రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా ఉద్యమకారులకు తగిన గుర్తింపు లభించలేదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.