AP: సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. "మత్స్యకారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు రూ. 20 వేలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెలలో మత్స్యకారుల ఖాతాల్లో రూ. 20,000 నగదు జమ చేస్తామని" వెల్లడించారు. అలాగే ఇప్పటికే పేదలకు దీపం కార్యక్రమం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు.