పంటలు కొనుగోలు చేయకుంటే రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం: KTR

TG: జనగామ నియోజకవర్గంలోని యశ్వంతాపూర్ గ్రామంలో 15 రోజులుగా పంట కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మార్క్‌ఫెడ్ ఎండీతో మాట్లాడి వెంటనే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. రైతుల పంటలను వెంటనే కొనుగోలు చేయకుంటే, ఎక్కడికక్కడ రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని KTR హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్