TG: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం దేవుడితో అయిన పోరాటం చేస్తుందని, ఎదురుగా ఎవరున్నా... దేవుడే దిగివచ్చి ఎదురొచ్చినా.. తెలంగాణ హక్కుల కోసం నిటారుగా నిలబడతామని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల విషయంలో ఎవరితోనైనా కొట్లాడుతామని స్పష్టం చేశారు. ప్రజలు తమపై విశ్వాసంతో ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటామన్నారు.