ఎసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరిస్తాం: భట్టి

TG: గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఎసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయలేదని, ఆ కమిటీలను మేం పునరుద్ధరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘రైతుల హక్కుల్ని కొందరు పెత్తందార్ల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టేలా ధరణిని రూపొందించారు. నాడు కాంగ్రెస్ పంచిన 24 లక్షల ఎకరాల భూములకు హక్కుల్లేకుండా చేశారు. ఆ సమస్యల్ని రైతులు నాకు చెప్పడంతో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడే చెప్పాం. చేసి చూపించాం’ అని భట్టి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్