అస్సాంలో ఒక్క అక్రమ వలసదారుడు కూడా ఉండటానికి వీల్లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం సోనిత్‌పూర్ జిల్లాలోని ధేకియాజులిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యనించారు. పట్టుబడిన ప్రతి చొరబాటుదారుడిని దేశం బయటకు పంపిస్తామని తెలిపారు. గత పదేండ్లలో బీజేపీ చొరబాటుదారులను అడ్డుకుందని, రాబోయే ఐదేండ్లలో ప్రతీ ఒక్కరినీ వెనక్కి పంపడమే లక్ష్యమని చెప్పారు. అక్రమ వలసదారులు స్థానిక యువత ఉద్యోగాలను, పేదల నోటి కాడి కూడును దోచుకున్నారని మండిపడ్డారు.