TG: కల్లు దుకాణాలను మూసివేసే కుట్రను అడ్డుకుని తీరుతామని BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 'కేసీఆర్ హయంలో ఈత, తాటి వనాలను పెంచాం. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం సొసైటీలకు కేటాయించడం లేదు. గౌడ సోదరులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించడం లేదు. HYD నుంచి కల్లు దుకాణాలు తరలించి చూడండి.. బీసీ కులాల సత్తా ఏమిటో చూపిస్తాం' అని హెచ్చరించారు.