హరిహర వీరమల్లును అడ్డుకుంటాం: బీసీ సంఘాలు (వీడియో)

AP: పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను దర్శకుడు వక్రీకరించారని ఆరోపిస్తూ బీసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పేర్కొంటున్నారు. సాయన్న.. 19వ శతాబ్దంలో దొరలు, దేశ్‌ముఖ్‌ల సంపదను కొల్లగొట్టి పేదలకు పంచిన ‘తెలంగాణ రాబిన్‌హుడ్’గా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాగా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా HHVM విడుదలకు సిద్ధమవుతోంది.

సంబంధిత పోస్ట్