TG: సంధ్య థియేటర్ ఘటనపై దర్యాప్తు కొన సాగుతోందని, న్యాయ పరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డిసెంబరు 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను ఆయన విడుదల చేశారు. బౌన్సర్లు ఇకపై పోలీసులను ముట్టుకున్నా, మిస్ బిహేవ్ చేసినా తాట తీస్తామని హెచ్చరించారు. దీనిపై పూర్తి బాధ్యత సప్లై ఏజెన్సీలదేనన్నారు. ప్రజలకు ఇబ్బంది గురించి ఆలోచించే బాధ్యత కూడా వీఐపీలదే అని స్పష్టం చేశారు.