ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రంగా మారుతున్న వేళ అమెరికా, జర్మనీ నుంచి ఇజ్రాయెల్‌కు ఇప్పటివరకు 14 మిలిటరీ కార్గో విమానాలు చేరుకున్నాయి. వీటిలో ఆయుధాలు, మిలిటరీ సామగ్రి ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. జూన్ 13 నుంచి యుద్ధం కొనసాగుతుండగా, ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రతిరోజూ రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తోందని సమాచారం.