హైదరాబాద్ కంటోన్మెంట్‌లోని ఆర్మీ స్థావరంలో ఆయుధాలు, మందుగుండు చోరీ కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం తనిఖీలో చోరీ జరిగినట్లు సైనికాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దికొద్దిగా మందుగుండును తప్పించి, ఆ తర్వాత ఆయుధాలు చోరీ చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అల్మారీలో ఆయుధాలు, మందుగుండు నిల్వల రికార్డులు సరిగా నిర్వహించడం లేదని గుర్తించారు. దుండగులు తాళం బద్దలు కొట్టి, పెట్టెలను పగలగొట్టినా సమీప సిబ్బందికి శబ్దాలు వినిపించలేదు. పెద్ద వర్షం కారణంగా శబ్దాలు వినిపించలేదని అధికారులు సమాధానం చెప్పారు.