భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రంగులు మన విధిని ప్రభావితం చేస్తాయి. బృహస్పతి గ్రహం పాలక దేవతగా, విష్ణువు పీతాంబరం లేదా పసుపు రంగును ధరించి ఉంటాడు. దీన్ని బట్టి గురువారాల్లో పసుపును ధరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ప్రకాశవంతమైన రంగు. ఇది మీలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తుంది. మీరు పసుపు రంగు దుస్తులు ధరించినప్పుడు రోజంతా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.