తెలంగాణలో మారనున్న వాతావరణం.. నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో గత వారం రోజుల వర్షాల తర్వాత వాతావరణంలో మార్పులు రానున్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి, చాలా చోట్ల 34-35 డిగ్రీల వరకు చేరనున్నాయి. సెప్టెంబర్ 29న దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 2 వరకు మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఆగ్నేయ తెలంగాణలో, ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕