పెళ్లి బస్సు బోల్తా.. ఐదుగురు మృతి

జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివాహ బృందం ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఈఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ లోని బలరాంపూర్ జిల్లా నుండి మహువాదర్ కు వెళ్తున్న బస్సు మహువాదర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓర్సా లోయ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్