TG: మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలంలో పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం పెళ్లి జరగాల్సి ఉండగా, సోమవారం అర్ధరాత్రి వరుడు రాజోలి మల్లేష్ (21) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లికూతురును తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.